FbTelugu

తెలంగాణలో 1850 కేసులు

హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో భారీగా మరోసారి కోవిడ్ కేసులు నమోదు అయ్యాయి. ఇవ్వాళ కొత్తగా 1850 కొరొనా పాజిటివ్ కేసులు వచ్చాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 22312 కు చేరుకున్నది.

గ్రేటర్ హైదరాబాద్ లో 1572, రంగారెడ్డి-92, మేడ్చెల్-53, కరీంనగర్-18, వరంగల్ ఉర్బన్-31, నల్గొండ-10, నిజామాబాద్-17 చొప్పున కేసులు నమోదు అయ్యాయి. ఇవ్వాళ 1342 మంది డిశ్చార్జ్  కాగా ఇప్పటి వరకు 11537 మంది ట్రీట్ మెంట్ తీసుకుని ఇళ్లకు వెళ్లారు. ఇవ్వాళ ఐదుగురు మరణించగా, ఇప్పటి వరకు 288 మంది మరణించారు. ప్రస్తుతం ఆక్టివ్ కేసులు 10487 ఉన్నట్లు వైద్యశాఖ వెల్లడించింది.

You might also like