FbTelugu

తెలంగాణ కేసులు 1924

హైదరాబాద్: రాష్ట్రంలో అధిక సంఖ్యలో మరోసారి కరోనా పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. గడచిన 24 గంటల్లో కొత్తగా 1924 కరోనా పాజిటివ్ కేసులు నమోదు అయినట్లు తెలంగాణ బులెటిన్ లో తెలిపారు.

గ్రేటర్ హైదరాబాద్ లో 1590, రంగారెడ్డిలో 99, మేడ్చెల్ 43, నల్గొండ 31, వరంగల్ 26, కరీంనగర్ 14, సంగారెడ్డి 20, నిజామాబాద్ 19, మహబూబ్ నగర్ 15, సిరిసిల్లలో 13 కేసులు వచ్చాయి. ఇవ్వాళ కొత్తగా 11 మరణాలు సంభవించగా ఇప్పటి వరకు 324 మంది మృతి చెందారు.

మొత్తం కేసుల సంఖ్య 29836 మంది కాగా, ప్రస్తుతం ఆక్టివ్ గా ఉన్న కేసులు 11933 అని వెల్లడించారు. ఈరోజు 992 మంది డిశ్చార్జీ కాగా మొత్తం ఇప్పటి వరకు 17279 మంది డిశ్చార్జీ అయి ఇళ్లకు వెళ్లారు.

You might also like

Leave A Reply

Your email address will not be published.