FbTelugu

తెలంగాణలో 1676 కేసులు

హైదరాబాద్: తెలంగాణలో గడచిన 24 గంటల్లో 1676 కరోనా పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయని హెల్త్ బులెటిన్ విడుదల చేశారు. రాష్ట్రంలో ఇప్పటి వరకు 208666 నమూనాలు పరీక్షించగా 16వ తేదీన 14027 నమూనాలు పరీక్షించినట్లు తెలిపారు.

రాష్ట్రంలో ఇప్పటి వరకు పాజిటివ్ కేసులు 39342 రాగా తాజాగా 1676 పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 41018కి చేరుకున్నది. ఇప్పటి వరకు 27295 మంది డిశ్చార్జీ కాగా 13328 మంది చికిత్స పొందుతున్నారు. ఈ రోజు 1296 మంది డిశ్చార్జీ అయి ఇళ్లకు వెళ్లారు. ఇప్పటి వరకు 386 మంది చనిపోగా గడచిన 24 గంటల్లో 10 మంది మృతి చెందినట్లు బులెటిన్ లో పేర్కొన్నారు.

You might also like