హైదరాబాద్: తెలంగాణలో కొత్తగా 1410 కరోనా పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. హైదరాబాద్ పరిధిలో 918 రాగా మిగతావి జిల్లాల్లో నమోదు అయినట్లు తెలంగాణ వైద్య, ఆరోగ్య శాఖ బులెటిన్ విడుదల చేసింది.
ఇవాళ 5954 నమూనాలు పరీక్షించగా 1410 పాజిటివ్ కేసులు వచ్చాయి. యాక్టీవ్ కేసులు 12423 ఉండగా ఇప్పటి వరకు 18192 మంది డిశ్చార్జీ అయ్యారు. ఈరోజు 913 మంది కోలుకుని డిశ్చార్జీ అయినట్లు ప్రకటించారు. ఇవాళ ఏడుగురు మృతి చెందగా ఇప్పటి వరకు 331 మంది చనిపోయారు.