FbTelugu

త్వరలో పిసిసి పీఠం ఖరారు

న్యూఢిల్లీ: వీలైనంత త్వరలో తెలంగాణ పిసిసి అధ్యక్ష పదవి కి నాయకుడి పేరు ను ప్రకటించాలని ఏఐసిసి నిర్ణయం తీసుకుందని కాంగ్రెస్ పార్టీ ముఖ్యనేత కె.సి.వేణుగోపాల్ తెలిపారు.

పంజాబ్ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీలో వివాదాన్ని పరిష్కరించేందుకు ఏర్పాటైన కమిటీ చర్చించి ఒక విధానాన్ని రూపొందించిందన్నారు. దాన్ని అమలు పరిచిన వెంటనే తెలంగాణ పిసిసి పీఠం పై దృష్టి సారించనున్నట్లు ఆయన వివరించారు. ఈ పదవి కోసం ఇప్పటికే రాష్ట్ర వ్యవహారాల ఇన్ ఛార్జి మాణిక్కం ఠాకూర్ ముఖ్య నాయకుల నుంచి అభిప్రాయ సేకరణ చేశారు. నాగార్జున సాగర్ ఉప ఎన్నికల తరువాత ప్రకటిస్తామని చెప్పిన పార్టీ పెద్దలు ఇంత వరకు ప్రకటించలేదు. ఈ పదవి కోసం ఎంపి కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి, ఎమ్మెల్యే తూర్పు జయప్రకాశ్ రెడ్డి, ఎంపి ఎ.రేవంత్ రెడ్డి సహా పలువురు పోటీ పడుతున్నారు. పదవికి పేరును ప్రకటిస్తారన్న ప్రతిసారి రాష్ట్రంలో కొందరు నాయకులు తమకే పదవి కావాలంటూ ప్రకటనలు గుప్పిస్తున్న విషయం తెలిసిందే. ఏఐసిసి నేతల పిలుపుతో రేవంత్ రెడ్డి శుక్రవారం రాత్రి ఢిల్లీ చేరుకున్నారు. ఇవాళ రేపు ఆయన పార్టీ ముఖ్య నాయకులను కలవనున్నారు.

You might also like

Leave A Reply

Your email address will not be published.