FbTelugu

తెలంగాణ కేసులు 2175

హైదరాబాద్: రాష్ట్రంలో గడచిన 24 గంటల్లో 1,36,096 టెస్టులు నిర్వహించగా 2,175 మందికి పాజిటివ్ వెల్లడి అయ్యింది. పాజిటివ్ తో 15 మంది చనిపోయారని తెలంగాణ వైద్య ఆరోగ్య శాఖ బులెటిన్ విడుదల చేసింది.
రాష్ట్రంలో ప్రస్తుతం 30,198 యాక్టివ్ కేసులు ఉండగా, నిన్న కరోనా బారిన పడి 3,821 మంది కోలుకున్నారు.

కరోనాతో ఇప్పటి వరకు 3,346 మంది చనిపోయారని తెలిపారు. ఇదిలా ఉండగా సికింద్రాబాద్ గాంధీ ఆసుపత్రిలో బ్లాక్ ఫంగస్ బారిన పడిన వారికి పెద్ద ఎత్తున ఆపరేషన్లు చేస్తున్నారు. గడచిన ఐదు రోజులుగా వంద మందికి పైగా ఆపరేషన్లు విజయవంతంగా నిర్వహించారు. ప్రస్తుతం 216 మంది బ్లాక్ ఫంగస్ బాధితులు చికిత్స పొందుతున్నారు.

You might also like

Leave A Reply

Your email address will not be published.