FbTelugu

విశాఖ స్టీల్ కు తెలంగాణ మావోయిస్టు మద్దతు

హైదరాబాద్: విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ పరిరక్షించుకునేందుకు పోరాటం చేస్తున్న ఉద్యమకారులకు తెలంగాణ మావోయిస్టు పార్టీ సంపూర్ణ మద్దతు ప్రకటించింది. ఈ మేరకు తెలంగాణ మావోయిస్టు పార్టీ అధికార ప్రతినిధి జగన్ పేరిట లేఖ విడుదల అయ్యింది.

ఫ్యాక్టరీని ప్రైవేటీరణ నుంచి రక్షించేందుకు తెలంగాణ ప్రజలు మద్దతు ఇవ్వాలని కోరారు. దేశ సంపదను సామ్రాజ్యవాదులు, పెట్టుబడిదారులకు ధారాదత్తం చేస్తోందని ఆయన మండిపడ్డారు. నూతన వ్యవసాయ చట్టాలను అమలులోకి తెచ్చి అన్నదాతలను బిచ్చగాళ్లను చేసేందుకు బీజేపీ ప్రభుత్వం కుట్రలు చేస్తున్నదని ఆరోపించారు. తమ న్యాయమైన హక్కుల కోసం పోరాటం చేస్తున్న రైతులు, కార్మికులను దేశ ద్రోహులుగా ముద్ర వేస్తున్నారని అన్నారు. విశాఖ ఉక్కు – ఆంధ్రుల హక్కు అని జగన్ తన లేఖలో స్పష్టం చేశారు. విశాఖ స్టీలు ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా పోరాడే వారికి తమ మద్దతు ఉంటుందని ఆ లేఖలో స్పష్టం చేశారు.

You might also like

Leave A Reply

Your email address will not be published.