FbTelugu

చిత్ర పరిశ్రమకు తెలంగాణ అనుకూలం: తలసాని

హైదరాబాద్: తెలంగాణ ప్రభుత్వం చిత్ర పరిశ్రమకు అనుకూలంగా ఉంటుందని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. ఇవాళ చిరంజీవి నివాసంలో సినిమా పరిశ్రమ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా తలసాని మాట్లాడుతూ.. సినీ పోస్ట్ ప్రొడక్షన్ పనులు నిర్వహించుకోవచ్చని దీని కోసం చర్యలు తీసుకుంటామని తెలిపారు.

షూటింగులపై త్వరలోనే తమ నిర్ణయం చెప్తామని తెలిపారు. షూటింగ్ చివరి దశలో ఆగిపోయిన వాటిని ఎలా షూట్ చేస్తారో ప్రభుత్వానికి ఒక వీడియో ప్రజెంటేషన్ ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నారు. ఈ సమావేశానికి చిరంజీవి, నాగార్జున, అల్లు అరవింద్, సురేష్ బాబు, రాజమౌలి, దిల్ రాజు, త్రివిక్రమ్, ఎన్ శంకర్, సి కల్యాణ్ హాజరైనారు.

You might also like