FbTelugu

మహారాష్ట్ర సరిహద్దుల్లో తెలంగాణ తనిఖీలు

నిజామాబాద్: మహారాష్ట్ర సరిహద్దు ప్రాంతంలో తెలంగాణ ప్రభుత్వం నిఘా పెంచింది. పొరుగు రాష్ట్రంలో కేసులు పెరుగుతుండడంతో అప్రమత్తమైంది. అక్కడి నుంచి వచ్చేవారికి కరోనా టెస్టులు నిర్వహించి, నెగెటివ్ వస్తేనే అనుమతిస్తున్నారు.
గత వారం రోజులుగా మహారాష్ట్రలో కరోనా కేసులు అనూహ్యంగా పెరిగాయి.

వేయి లోపు నమోదు అయ్యే కేసులు ఏడువేలకు చేరుకున్నాయి. పరిస్థితిని నియంత్రణలోకి తెచ్చేందుకు కొన్ని జిల్లాల్లో లాక్ డౌన్ అమలు చేస్తున్నది. సరిహద్దు ప్రాంతాలైన బోధన్, రేంజల్, నవీపేట, మద్నూర్, జుక్కల్, బిచ్కుంద మండలాల ప్రజల రాకపోకలు ఎక్కువగా ఉంటాయి. ముందు జాగ్రత్త చర్యగా బోధన్ మండలం సాలూర వద్ద టెస్టు సెంటర్ ఏర్పాటు చేశారు. మహారాష్ట్ర నుంచి వస్తున్నవారికి పరీక్షలు నిర్వహిస్తు, వివరాలు సేకరిస్తున్నారు. జలుబు, దగ్గు, జ్వరం ఉన్నవారిని ఆసుపత్రికి సిఫారసు చేస్తున్నారు.

You might also like

Leave A Reply

Your email address will not be published.