FbTelugu

తెలంగాణలో అత్యధికంగా 546 కేసులు

హైదరాబాద్: తెలంగాణలో నేడు 546 కరోనా కేసులు నమోదయ్యి రికార్డు సృష్టించాయి. జీహెచ్ఎంసీ పరిధిలో 458 కేసులు రాగా, రంగారెడ్డి జిల్లాలో 50 కేసులు  అత్యధికంగా వచ్చాయి.

దీంతో తెలంగాణలో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 7072కి చేరింది. ఇప్పటి వరకు కరోనాతో కోలుకొని 3506 మంది డిశ్చార్జ్ కాగా, ప్రస్తుతం 3363 యాక్టివ్ కేసులున్నాయి. నేడు కరోనాతో ఐదుగురు మరణించగా, ఇప్పటి వరకు 203 మంది మరణించారు. గత రెండు మూడు రోజులుగా టెస్టుల సంఖ్య పెరగడంతో కేసులు కూడా ఎక్కువగా నమోదు అవుతున్నాయి. ఈరోజు 3188 మందిని పరీక్షించారు.

You might also like