FbTelugu

ఎల్ఆర్ఎస్ కు చెల్లుచీటి

హైదరాబాద్: లే అవుట్ రెగ్యులరైజేషన్ స్కీమ్ (ఎల్ఆర్ఎస్) తో సంబంధం లేకుండానే ప్లాట్లను రిజిస్ట్రేషన్ చేయాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది. కొన్ని అంశాలపై తలా తోక లేకుండా నిర్ణయాలు తీసుకుంటున్న సీఎం కేసీఆర్, ప్రజల నుంచి వ్యతిరేకత రావడంతో యూ టర్న్ తీసుకుంటున్నారు.

ప్రజలను మూడు నాలుగు నెలలుగా ఇబ్బందులకు గురి చేసిన ప్రభుత్వం ఊరట కల్పించేలా ఆదేశాలు జారీ చేసింది. వ్యవసాయేతర ఆస్తుల రిజిస్ట్రేషన్ కు ఎల్ఆర్ఎస్ కు లింకు పెట్టింది. ఫలితంగా ప్రజలు నానా కష్టాలు పడుతున్నారు. మూడు నెలలుగా సమస్య కొలిక్కి రాకపోవడంతో ధరణి వెబ్ సైట్ లో రిజిస్ట్రేషన్ చేయించుకోలేకపోయారు. దీనిపై ప్రజల నుంచి తీవ్ర వ్యతిరేకత రావడంతో ఈ వెబ్ సైట్ ను మూసి వేసి, పాత విధానం కార్డు తోనే రిజిస్ట్రేషన్లకు సీఎం కేసీఆర్ అనుమతించారు.

ఇప్పటి వరకు జరిగిన రిజిస్ట్రేషన్ ప్లాట్లను ఎల్ఆర్ఎస్ తో సంబంధం లేకుండా రిజిస్ట్రేషన్ చేయనున్నట్లు రిజిస్ట్రేషన్ అండ్ స్టాంప్స్ ఐజీ సర్క్యూలర్ జారీ చేశారు. ఇక నుంచి అనుమతి లేని లేఅవుట్లలో కొత్తగా ప్లాట్లు కొనుగోలు చేసే వారికి మాత్రం ఈ మినహాయింపు ఉండదు. లేఅవుట్లకు పట్టణ ప్రణాళిక సంస్థలు, మున్సిపల్ కార్పొరేషన్ల  అనుమతి ఉంటే తప్ప రిజిస్ట్రేషన్ చేసే అవకాశం ఉండదని ఆ సర్క్యూలర్ లో పేర్కొన్నారు.

You might also like

Leave A Reply

Your email address will not be published.