FbTelugu

టిఎస్ ఎంసెట్ గడువు పొడిగింపు

హైదరాబాద్: తెలంగాణ ప్రభుత్వం ఎంసెట్ పరీక్షకు దరఖాస్తు చేయని వారికి మరో అవకాశం కల్పించింది. ఎంసెట్-2021 ఆన్ లైన్ లో సమర్పించే దరఖాస్తు గడువును పొడిగించింది.

ఎలాంటి ఆలస్య రుసుం లేకుండా మే 26వ తేదీ వరకు దరఖాస్తులు స్వీకరించనున్నట్లు ఎంసెట్ కన్వీనర్ ప్రొఫెసర్ ఏ.గోవర్థన్ తెలిపారు. అర్హులైన విద్యార్థులు దరఖాస్తు చేయనట్లయితే ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు.

You might also like

Leave A Reply

Your email address will not be published.