FbTelugu

వ్యాక్సిన్ కోసం తెలంగాణ గ్లోబల్ టెండర్లు

హైదరాబాద్: తెలంగాణ ప్రభుత్వం కరోనా వ్యాక్సిన్లను సమీకరించుకునేందుకు గ్లోబల్ టెండర్లను ఆహ్వానించింది. ఈ మేరకు షార్ట్ టెండర్ నోటిఫికేషన్ జారీ చేసింది. ఈ టెండర్ల ద్వారా 10 మిలియన్ డోసుల వ్యాక్సిన్ సేకరించనున్నట్లు తెలిపింది.

బిడ్ల దాఖలుకు జూన్ 4 చివరి తేదీగా ప్రకటించి, ఆరు నెలల వ్యవధిలో 10 మిలియన్ డోసులు సరఫరా చేయాలని నిబంధన విధించింది. ప్రతినెలా 1.5 మిలియన్ డోసుల చొప్పున తెలంగాణ ప్రభుత్వానికి అందచేయాల్సిన ఉంటుంది. తెలంగాణ రాష్రంలో నాలుగు కోట్ల మంది ప్రజలకు వ్యాక్సినేషన్ చేయాల్సి ఉండగా ఇప్పటి వరకు 60 లక్షల డొసులు ఇచ్చారు. మిగిలిన వారికి ఇచ్చేందుకు అవసరమైన డోసులు సేకరించేందుకు గ్లోబల్ టెండర్లకు వెళ్తున్నట్లు ప్రభుత్వం వెల్లడించింది.

You might also like

Leave A Reply

Your email address will not be published.