FbTelugu

జెండా ఎగురవేసిన సిఎం కెసిఆర్

హైదరాబాద్: రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ప్రగతి భవన్ లో ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు జాతీయ జెండా ఎగురవేశారు. అంతకు ముందు గన్ పార్క్ వద్దకు వెళ్లి అమరవీరుల స్థూపం వద్ద నివాళులు అర్పించారు.

తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఉప రాష్ట్రపతి ఎం.వెంకయ్య నాయుడు, ప్రధాని నరేంద్ర మోదీ రాష్ట్ర ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. ఘనమైన చరిత్ర, విశిష్ట సంస్కృతులకు తెలంగాణ నిలయమని వెంకయ్యనాయడు ట్వీట్ చేశారు. తెలంగాణ అన్ని రంగాల్లో స్వయం సమృద్ధి, ప్రగతి సాధించాలని అన్నారు. అభివృద్ సంక్షేమంలో రాష్ట్రం కొత్త చరిత్రను సృష్టిస్తోందని గవర్నర్ తమిళి సై సౌందరరాజన్ అన్నారు. ప్రజల కృషి తో కరోనా మహమ్మారి నుంచి త్వరలో బయటపడతామని ఆమె ఆశాభావం వ్యక్తం చేశారు. రాష్ట్రవ్యాప్తంగా మంత్రులు, ఇతర ప్రజాప్రతినిధులు ఆవిర్భావ వేడుకల్లో పాల్గొన్నారు.

You might also like

Leave A Reply

Your email address will not be published.