FbTelugu

ఎన్నికల సంఘం ఆదేశాలు సస్పెండ్

హైదరాబాద్: బ్యాలెట్ పేపర్లపై స్వస్తిక్ ముద్ర బదులు పెన్నుతో గీసినా పరిగణనలోకి తీసుకోవాలంటూ రాష్ట్ర ఎన్నికల సంఘం (ఎస్ఈసీ) జారీ చేసిన ఆదేశాలను హైకోర్టు కొట్టివేసింది.

జీహెచ్ఎంసీ ఓట్ల లెక్కింపు తరువాత గెలుపోటములు సమీపంలో పెన్ను మార్కింగ్ ఓట్లు ఉంటే తుది ఉత్తర్వులకు లోబడి ఫలితాలు ప్రకటించాలని రాష్ట్ర ఎన్నికల సంఘాన్ని ఆదేశించింది. గురువారం అర్థరాత్రి జారీ అయిన ఈ ఆదేశాలపై ఇవాళ ఉదయం హైకోర్టులో హౌస్ మోషన్  పిటీషన్ దాఖలు చేశారు. పిటీషన్ ను పరిశీలించిన హైకోర్టు పై ఉత్తర్వులు జారీ చేసింది.

You might also like

Leave A Reply

Your email address will not be published.