FbTelugu

తెలంగాణ లెక్క ఒక వేయి దాటింది

హైదరాబాద్: తెలంగాణలో తొలిసారి కరోనా పాజిటివ్ కేసులు వేయి దాటాయి. గడచిన 24 గంటల వ్యవధిలో 1087 కేసులు నమోదు అయ్యాయి.

అత్యధికంగా గ్రేటర్ హైదరాబాద్ లో 888, రంగారెడ్డిలో 74, మేడ్చల్ లో 37, నల్లగొండ 35 నమోదు అయ్యాయి. మిగతా జిల్లాల్లో 11 నుంచి 1 మధ్య నమోదు అయినట్లు తెలంగాణ ప్రభుత్వం ప్రకటించింది. ఇవాళ 3923 నమూనాలు పరీక్షించారు. కరోనా పాజిటివ్ కేసులు 13436 కాగా 4928 మంది డిశ్చార్జీ కావడంతో 8265 యాక్టివ్ కేసులు ఉన్నాయి.

ఇవాళ ఆరుగురు చనిపోగా, ఇప్పటి వరకు 243 మంది మృతి చెందారు. కేసుల సంఖ్య పెరగడంతో ప్రభుత్వం ప్రజలను అప్రమత్తంగా ఉండాలని కోరింది. కొన్ని ప్రైవేటు ఆసుపత్రులు కరోనా పరీక్షల్లో కేంద్ర ప్రభుత్వ మార్గదర్శకాలు పాటించడం లేదని పేర్కొంది. 48 గంటల వ్యవధిలో తప్పులు సరిదిద్దుకోనట్లయితే పర్మిషన్లు రద్దు చేస్తామని ప్రభుత్వం హెచ్చరించింది.

You might also like