FbTelugu

తెలంగాణ కరోనా కేసులు 872

గ్రేటర్ లోనే సింహభాగం

హైదరాబాద్: తెలంగాణ కరోనా కేసుల విజృంభణ కొనసాగుతోంది. ఇవాళ అత్యధికంగా 872 పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి.

గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో 713, రంగారెడ్డిలో 107, మేడ్చల్ లో 16 కేసులతో పాటు మిగతా జిల్లాల్లో కేసులు నమోదు అయినట్లు తెలంగాణ ప్రభుత్వం ప్రకటించింది. ఇవాళ 3189 నమూనాలు గ్రేటర్ పరిధిలో పరీక్షించగా 800 కు పైగా కేసులు వచ్చాయి. ఏడుగురు చనిపోగా, ఇప్పటి వరకు 217 మంది మృతి చెందారు. ఈరోజు 274 మంది డిశ్చార్జీ కాగా ఇప్పటి వరకు 4005 మంది కోలుకుని ఇళ్లకు వెళ్లారు.

You might also like