FbTelugu

నాందేడ్ హత్యలను ఛేదించిన తెలంగాణ…!

హైదరాబాద్: మహారాష్ట్రలోని నాందేడ్ లో ఇద్దరు సాధువుల హత్యను తెలంగాణ పోలీసులు 24 గంటల వ్యవధిలో ఛేదించారు. విచారణ తరువాత నిందితుడిని మహారాష్ట్ర పోలీసులకు అప్పగించారు.

నాందేడ్ లో శనివారం బాలబ్రహ్మచారి శివాచార్య, ఆయన శిష్యుడుగా భావిస్తున్న భగవాన్ షిండేని వారి ఆశ్రమంలోనే దుండగులు హత్య చేశారు. వరుసగా సాధువుల హత్యలు జరుగుతుండడంతో మహారాష్ట్ర పోలీసులు విచారణ వేగవంతం చేశారు.

హత్య చేసిన దుండగులు మహారాష్ట్ర నుంచి తెలంగాణలోకి ప్రవేశించినట్లు సమాచారం అందిన క్షణమే ఈ విషయాన్ని పోలీసులకు తెలియచేశారు. రంగంలోకి దిగిన స్పెషల్ పార్టీ పోలీసులు అనుమానస్పదంగా తిరుగుతున్న సాయినాథ్ శింఘాడేని అదుపులోకి తీసుకున్నారు. డబ్బు, బంగారం కోసం సాధువులను హత్య చేసినట్లు పోలీసుల విచారణ లో శింఘాడే వెల్లడించారు. హత్యలు చేసినట్లు ఒప్పుకోవడంతో అతన్ని తెలంగాణ పోలీసులు మహారాష్ట్ర పోలీసులకు అప్పగించారు.

You might also like