FbTelugu

తెలంగాణ కేసులు 894

హైదరాబాద్: రాష్ట్రంలో కొత్తగా 894 పాజిటివ్ కేసులు నమోదు అయినట్లు తెలంగాణ వైద్య ఆరోగ్య శాఖ హెల్త్ బులెటిన్ ప్రకటించింది. వైరస్ సోకి 10 మంది మరణించారు.

ఇప్పటి వరకు రాష్ట్రంలో 92,255 కరోనా పాజిటివ్ కేసులు నిర్థారణ కాగా 70,132 మంది డిశ్చార్జీ అయ్యారు. మిగతా 21,420 మంది హాస్పిటళ్లల చికిత్స తీసుకుంటున్నారు. ఇంట్లో, ఐసోలేషన్ కేంద్రాల్లో 14,404 మంది ఉన్నారు. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో 147, రంగారెడ్డి లో 85, మేడ్చల్ లో 51, మిగతా జిల్లాల్లో స్వల్పంగా కేసులు నమోదు అయినట్లు బులెటిన్ లో వెల్లడించారు.

You might also like