FbTelugu

తెలంగాణ కేసులు 178

హైదరాబాద్: తెలంగాణలో గడచిన 24 గంటల్లో 178 కరోనా పాజిటివ్ కేసులు నిర్ధారణ అయ్యాయి. ఈ మేరకు తెలంగాణ హెల్త్ బులెటిన్ విడుదల చేశారు.

వాటిలో జీహెచ్‌ఎంసీ పరిధిలో 143 కేసులు నమోదయ్యాయి. దీంతో రాష్ట్రంలో నమోదైన కేసులు 3,920కి చేరుకున్నది. ఇప్పటివరకు రాష్ట్రంలో కరోనా బారి నుంచి 1,742 మంది బాధితులు కోలుకోగా, 2,030 మంది హాస్పిటళ్లలో చికిత్స పొందుతున్నారు. ఇవాళ కరోనాతో ఆరుగురు మృతి చెందగా, ఇప్పటి వరకు 148 మంది మరణించారు.

You might also like