FbTelugu

నేడు తెలంగాణ కేబినెట్ కీలక భేటీ

హైదరాబాద్: ఇవాళ సాయంత్రం 5:00 గంటలకు తెలంగాణ కేబినెట్ ముఖ్యమంత్రి కేసీఆర్ అధ్యక్షతన సమావేశం కానుంది. ఈ సమావేశంలో ముఖ్యంగా రాష్ట్రంలో తాజా పరిణామాలపై చర్చించనున్నారు.

లాక్ డౌన్ పై చర్చించే అవకాశం ఉంది. రాష్ట్రంలో ఆర్టీసీ సర్వీసులపై ఓ నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. నియంత్రిత పద్దతిలో పంటల సాగుపై కూడా చర్చించనున్నట్టు తెలుస్తోంది.

You might also like