FbTelugu

ఎల్లుండి తెలంగాణ కేబినెట్ భేటీ

telangana-cabinet-meet-on-novermber-2nd

హైదరాబాద్: రాష్ట్రంలో చోటుచేసుకుందటున్న తాజా పరిణామాలను దృష్టిలో ఉంచుకొని నవంబర్ 2న ప్రగతి భవన్ లో సీఎం కేసీఆర్ నేతృత్వంలో తెలంగాణ కేబినెట్ సమావేశం కానుంది. ఆర్టీసీ కార్మికుల సమ్మెపై ఓ కీలక నిర్ణయం తీసుకునేందుకు తెలంగాణ సర్కారు సిద్ధమైనట్లు తెలుస్తోంది. ప్రజలకు ఇబ్బందులు కలగకుండా ప్రత్యామ్నాయ రవాణా విధానాన్ని అమల్లోకి తీసుకురావాలని ప్రభుత్వం ఇప్పటికే నిర్ణయం తీసుకుంది. ఆర్టీసీలో 50 శాతం యాజమాన్యం బస్సులు, 30 శాతం అద్దె, 20 శాతం ప్రైవేట్ స్టేజ్ కేరియర్లు ఉండాలని యోచిస్తోంది. ప్రైవేట్ స్టేజ్ కేరియర్లకు అనుమతులు ఇచ్చే అవకాశం ఉంది. అలాగే సెట్విన్ సర్వీసుల సేవలు వినియోగించుకోవడం వంటి అంశాలను సర్కారు పరిశీలిస్తోంది. వీటితో పాటు మునిసిపల్ ఎన్నికలపై కూడా కేబినెట్ చర్చించనుంది.

You might also like