FbTelugu

లాక్ డౌన్ పై రేపే తెలంగాణ క్యాబినెట్ నిర్ణయం?

హైదరాబాద్: కరోనా సెకండ్ వేవ్ తీవ్రత ఊహించని స్థాయిలో ఉండడంతో చర్చించేందుకు మంగళవారం మధ్యాహ్నం తెలంగాణ మంత్రి మండలి సమావేశం అవుతోంది. ప్రగతి భవన్ లో మధ్యాహ్నం సిఎం కెసిఆర్ అధ్యక్షతన మంత్రి మండలి సమావేశం జరగనున్నది.

రోజు రోజుకూ కరోనా విజృంభిస్తున్న నేపథ్యంలో.. రాష్ట్రంలో లాక్ డౌన్  విధింపు పై క్యాబినెట్ లో చర్చించి నిర్ణయం తీసుకోనున్నారు. కొన్ని రాష్ట్రాల్లో లాక్ డౌన్ విధించినా కూడా కరోనా అంతగా తగ్గుతలేదని, సరైన ఫలితాలు లేవని రిపోర్టులు అందుతున్నవి. ఈ నేపథ్యంలో లాక్ డౌన్ విధింపు పై భిన్నాభిప్రాయాలు వ్యక్తమౌతున్నాయి. కొన్ని వర్గాలు లాక్ డౌన్  కావాలని కోరుకుంటున్నపరిస్థితి కూడా వున్నది. ఈ పరిస్థితుల్లో.. లాక్ డౌన్ విధించడం వల్ల కలిగే లాభ నష్టాలతో పాటు, రాష్ట్రంలో కొనసాగుతున్న ధాన్యం కొనుగోళ్ల ప్రక్రియ మీద లాక్ డౌన్ ప్రభావం ఏమేరకు ఉంటుందనే అంశం పై మంత్రి మండలి చర్చించి నిర్ణయం తీసుకోనున్నది. రాష్ట్రంలో తాజా పరిస్థితులపై ఇవాళ సిఎం కెసిఆర్ ప్రగతి భవన్ లో నిర్వహించిన సమీక్షా సమావేశానికి మంత్రి హరీశ్ రావు, వైద్య ఆరోగ్య శాఖ అధికారులు పాల్గొన్నారు.

You might also like

Leave A Reply

Your email address will not be published.