FbTelugu

తెలంగాణ బీజేపీ నూతన రాష్ట్ర కమిటి

హైదరాబాద్: తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ 23 మందితో పార్టీ రాష్ట్ర కమిటిని ప్రకటించారు. ఈ కమిటీలో 8 మంది ఉపాధ్యక్షులు, 8 మంది కార్యదర్శులు, నలుగురు ప్రధాన కార్యదర్శులు ఉన్నారు
అదే విధంగా ఆరుగురు మహిళలకు చోటు కల్పించారు. అయితే పాతవారికే ఎక్కువగా ప్రాధన్యం ఇచ్చారు. జిల్లాల్లో పార్టీ విస్తరించేందుకు అనుగుణంగా నియామకాలు జరగలేదన్న విమర్శలు ఉన్నాయి.

ఉపాధ్యక్షులు: జి.విజయరామా రావు, చింతల రామచంద్రారెడ్డి, సంకినేని వెంకటేశ్వర్‌ రావు, యెండల లక్ష్మినారాయణ, ఎన్వీఎస్‌ఎస్‌ ప్రభాకర్‌, యెన్నం శ్రీనివాస్‌రెడ్డి, మనోహర్‌రెడ్డి, బండారు శోభారాణి

ప్రధాన కార్యదర్శులు: ప్రేమేందర్‌ రెడ్డి, దుగ్యాల ప్రదీప్‌ కుమార్‌, బండారు శృతి, మంత్రి శ్రీనివాసులు

కార్యదర్శులు: రఘునందన్‌ రావు, ప్రకాశ్‌ రెడ్డి, శ్రీనివాస్‌ గౌడ్‌, బొమ్మ జయశ్రీ, పల్లె గంగారెడ్డి, కుంజా సత్యవతి, మాధవి, ఉమారాణి

కోశాధికారి: బండారి శాంతికుమార్‌, బవర్ లాల్ వర్మ (సంయుక్త కోశాధికారి)

కార్యాలయ కార్యదర్శి: ఉమా శంకర్‌

అధికార ప్రతినిధులు: కృష్ణ సాగర్ రావు, రజిని కుమారి, రాకేష్ రెడ్డి

బీజేపీ అనుబంధ సంఘాలు
1. యువ మోర్చా- భాను ప్రకాష్
2. మహిళ మోర్చా – గీతా మూర్తి
3. కిషన్ మోర్చా – కొండపల్లి శ్రీధర్ రెడ్డి
4. ఎస్సీ మోర్చా – కొప్పుల బాషా
5. ఓబీసి మోర్చా- అలె భాస్కర్
6. మైనార్టీ మోర్చా – ఆస్ఫర్ పాషా.

You might also like