FbTelugu

మహారాష్ట్ర బోర్డర్ మూసివేత

నిజామాబాద్: మహారాష్ట్రలో కరోనా కేసులు పెరుగుతుండడంతో తెలంగాణ ప్రభుత్వం అప్రమత్తమైంది. నిజామాబాద్‌కు రాకపోకల నిలిపివేశారు.

జిల్లాలోని రెంజల్ మండలం కందకుర్తి గ్రామ శివారులో ఏర్పాటుచేసిన అంతరాష్ట్ర సరిహద్దు చెక్ పోస్ట్ వద్ద రాకపోకలను అధికారులు నిలిపి వేశారు. వంతెన వద్ద పొరుగు రాష్ట్రాల వాహనాలు రాకుండా రోడ్డుకు ఇరు వైపులా బరికేడ్లను పోలీసులు ఏర్పాటు చేశారు. సరిహద్దు ప్రాంతంలోని ప్రజలు నిత్యం ఏదో ఒక పని మీద మహారాష్ట్ర వెళ్లి వస్తుంటారు. రాకపోకల కారణంగా తెలంగాణలో కేసులు పెరిగే ప్రమాదముందని ఈ చర్యలు తీసుకున్నారు.

You might also like

Leave A Reply

Your email address will not be published.