FbTelugu

టెక్నాలజీ వచ్చినా రైతుల ముఖంలో ఆనందం లేదు…

Technology-does-not-bring-happiness-to-farmers

కరీంనగర్: వీణవంక మండలం బేతిగల్ గ్రామంలో శ్రీ సీతారామ చంద్రస్వామి వారి ఆలయంలో చేసిన శ్రీ శ్రీ శ్రీ త్రిదండి శ్రీమన్నారాయణ రామానుజ చిన్న జీయర్ స్వామి మూర్తి విగ్రహ ప్రతిష్టాపన చేశారు. ఈ మహోత్సవ కార్యక్రమానికి వైద్య, ఆరోగ్య శాఖా మంత్రి ఈటల రాజేందర్ హాజరయ్యారు. విగ్రహ ప్రతిష్టాపన తరువాత మంత్రి ఈటల రాజేందర్ మాట్లాడారు. బేతిగల్ గ్రామానికి చిన్న జీయర్ స్వామి వారు రావడం ఆనందం కలిగిస్తుదన్నారు. 20,30 ఏళ్లుగా పశ్చిమ గోదావరిలో ఎలాగైతే పంటలు పండుతాయో అలాంటి భూములు మనవి అన్నారు. హైబ్రిడ్ విత్తనాలు వచ్చాక పంట కనపడుతుంది కానీ సుఖం, సంతోషం లేదన్నారు. ఏం మారిందో కానీ.. ఇంత అధునాతన టెక్నాలజీ వచ్చాక కూడా రైతుల ముఖంలో ఆనందం లేదు. చిన్న జీయర్ స్వామి కేవలం తత్వం మాత్రమే చెప్తారు అని అందరూ అనుకుంటున్నారు.. కానీ మనుషుల ఆరోగ్యం గురించి కూడా ఆలోచిస్తారు. పురాతన కాలంలో మన ఇంటికి చుట్టాలు వచ్చినపుడు మాత్రమే అన్నం తినేవాళ్ళం.. అది కూడా మోదుగు ఆకులలో తినేవాళ్ళమన్నారు. నేను మంత్రిగా ప్రమాణ స్వీకారం చేశాక నాకు చాలా విషయాలు చెప్పారు. క్యాన్సర్ కు కూడా తక్కువ ఖర్చుతో స్వామి దగ్గర మందులు ఉన్నాయి. ముసలి వాళ్ళను పనికి రాని వాళ్ళని మాత్రం అనుకోకండి.. కానీ ముసలి వాళ్ళు మన చిన్న పిల్లలకి సంస్కారం నేర్పుతారని ఈటల అన్నారు.

You might also like