FbTelugu

కొత్త వీసా నిబంధనలపై టెక్ కంపెనీల పిటీషన్

వాషింగ్టన్: ఎన్నికలు దగ్గరపడుతున్న కొద్ది ఓటర్లను ఆకర్షించేందుకు ప్రెసిడెంట్ డోనాల్డ్ ట్రంప్ ఎత్తులు వేస్తున్నారు. ఆయన వేసే ఎత్తులు టెక్ కంపెనీలకు శాపంగా పరిణమించాయి.
ఇమ్మిగ్రేషన్ అండ్ కస్టమ్స్ ఎన్ ఫోర్స్ మెంట్ విభాగం తీసుకువచ్చిన కొత్త వీసా నిబంధనలపై పోరాడాలని ప్రముఖ టెక్ కంపెనీలు నిర్ణయించాయి. ఆన్ లైన్ తరగతులకు హాజరయ్యే విదేశీ విద్యార్థులు అమెరికా విడిచి వెళ్లాల్సి ఉంటుందని ఇటీవల ఈ నిబంధనలు తీసుకువచ్చిన విషయం విధితమే. ఈ విధానాన్ని వ్యతిరేకిస్తూ పలువురు గళమెత్తారు. ఎంఐటీ, హార్వర్డ్ యూనివర్సటీ వేసిన పిటీషన్ లో ప్రముఖ కంపెనీలు గూగుల్, మెక్రోసాప్ట్, ఫేస్ బుక్ కంపెనీలు చేరాయి.

తాజా నిబంధనల ప్రకారం వచ్చే విద్యా సంవత్సరం ఆన్ లైన్ క్లాసు లకు దరఖాస్తు చేసుకున్న విద్యార్థులకు వీసా జారీ చేయరు. వారిని దేశంలోకి అనుమతించేది లేదని స్పష్టం చేశారు. నాన్ ఇమ్మిగ్రెంట్ వీసా ఎఫ్1, ఎం1 పై ఉంటూ తరగతులకు హాజరవుతున్నవారు దేశం విడిచి వెళ్లాల్సి ఉంటుంది. ఇక్కడే ఉండాలని అనుకుంటే ఎప్పటిలాగే తరగతులు నిర్వహిస్తున్న విద్యా సంస్థలకు బదిలీ కావాలని నిబంధనల్లో పేర్కొన్నారు. ఈ నిబంధనలపై ప్రముఖ టెక్ కంపెనీలు గుర్రుగా ఉన్నాయి.

You might also like

Leave A Reply

Your email address will not be published.