* టెస్టు సిరీస్ కు ఎంపిక
న్యూఢిల్లీ: ఆస్ట్రేలియాపై జరిగిన టెస్ట్ మ్యాచ్ లో టీమిండియా ఘన విజయం సాధించి.. మంచి ఫామ్ లో ఉంది. తదుపరి ఇంగ్లాండ్ తో టెస్టు సిరీస్ లో అమీ తుమీ తేల్చుకోనుంది. ఫిబ్రవరిలో జరగనున్న ఈ టెస్టు మ్యాచులకు టీమిండియాను ఎంపిక చేశారు. మొత్తం ఇంగ్లండ్ తో 4 టెస్టులు జరగనుండగా.. మొదటి 2 టెస్టులకు భారత్ ఎంపికైంది.
ఈ తరుణంలో విరాట్ కోహ్లీ సారథ్యంలో 18 మందితో జట్టును ఇప్పటికే ప్రకటించారు. కెప్టెన్ గా విరాట్ కోహ్లీ, వైస్ కెప్టెన్ గా అజింక్యా రహానే, రోహిత్ శర్మ, కేఎల్ రాహుల్, రిషబ్ పంత్, హార్దిక్ పాండ్య, వృద్ధిమాన్ సాహా, అశ్విన్, మయాంక్ అగర్వాల్, ఛటేశ్వర్ పుజారా, కుల్దీప్ యాదవ్, అక్షర్ పటేల్, వాషింగ్టన్ సుందర్, శుభ్ మాన్ గిల్, ఇషాంత్ శర్మ, జస్ప్రీత్ బుమ్రా, శార్దూల్ ఠాకూర్, మహ్మద్ సిరాజ్ లు ఉన్నారు.