FbTelugu

ఉపాధ్యాయులు విధులకు రావాల్సిందే: ఏపీ

అమరావతి: రాష్ట్రంలో ప్రతి పాఠశాలలో పనిచేసే ఉపాధ్యాయులు వారంలో రెండు రోజులు హాజరు కావాల్సిందేనని ఏపీ విద్యాశాఖ ఆదేశాలు జారీ చేసింది.

ప్రాథమిక పాఠశాలలో పనిచేసేవారు ఒకరోజు, ప్రాథమికోన్నత పాఠశాలలో పనిచేసేవారు రెండు రోజులు రావాల్సిందేనని స్పష్టం చేశారు. కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ఉపాధ్యాయుల పనిదినాలను కుదించారు. బ్రిడ్జీ కోర్సుల ద్వారా విద్యార్థులకు ఆన్ లైన్, ఆప్ లైన్ లో టచ్ లో ఉండే విధంగా పాఠశాల విద్యాశాఖ ఉన్నతాధికారులు ప్రణాళిక సిద్ధం చేస్తున్నారు.

You might also like