FbTelugu

రూ.1 కోటితో ఉడాయించిన టీచర్

గుంటూరు: తన భార్య కన్పించడం లేదని భర్త ఫిర్యాదు చేయగా, తమ వద్ద అప్పు చేసి పారిపోయిందని బాధితులు లబొదిబోమంటున్నారు. భర్త ఫిర్యాదుతో పోలీసులు వెతికే పనిలో పడ్డారు.

మంగళగిరి ఎన్ఎస్ఆర్ ప్లాజా అపార్ట్ మెంట్ లో ప్రభుత్వ టీచర్ ఝాన్సీరాణి భర్తతో కలిసి నివాసం ఉంటున్నారు. తన భార్య కన్పించడం లేదని భర్త వీరాంజనేయులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ నెల 11న గాలి గోపురం వద్ద టూ వీలర్ పార్క్ చేసి కన్పించకుండా పోయిందని, అప్పటి నుంచి కన్పించడం లేదని పోలీసులకు తెలిపాడు. ఝాన్సీరాణి ప్రస్తుతం తుళ్లూరు మండంల మందడం లో హిందీ ఉపాధ్యాయురాలిగా పనిచేస్తున్నారు. తనకు తెలిసిన వారు, బంధువుల నుంచి సుమారు రూ.1 కోటి కి పైగా అప్పలు చేసిందని అంటున్నారు.

తమ బాకీలు చెల్లించాల్సి వస్తుందని పారిపోయిందని బాధితులు మొత్తుకుంటున్నారు. భర్తకు తెలిసే ఆమె మాయమైందని, ఎక్కడికి పారిపోలేదని అంటున్నారు. బ్యాంకు ఖాతాల కోసం సీక్రెట్ మొబైల్ నెంబర్ వాడుతున్నట్లు పోలీసుల విచారణలో తేలింది.

You might also like

Leave A Reply

Your email address will not be published.