FbTelugu

స్కూలులో మద్యం సేవిస్తున్న ఉపాధ్యాయుడు

చిత్తూరు: చంద్రగిరి నియోజకవర్గం పాకాల మండలం మొగరాల పంచాయితీలోని కృష్ణాపురం ప్రాథమిక పాఠశాల ను ఒక ఉపాధ్యాయుడు బార్ గా మార్చాడు. పిల్లలకి పాఠాలు చెప్పవలసిన టీచర్ పాఠశాలలోని విద్యార్థుల సాక్షిగా మద్యం సేవిస్తూ మత్తులో తేలియాడాడు.

గురువారం నాడు ఇదేంటని ప్రశ్నించిన విద్యార్థుల తల్లిదండ్రులపై అసభ్యకరంగా పచ్చి బూతులు మాట్లాడాడు. ఆయన సంబాషణలను వీడియో చిత్రీకరిస్తున్న ఓ మహిళతో బట్టలు విప్పుతాను తీసుకుంటావా అంటూ బరితెగించి ప్రవర్తించాడు. విద్యార్థులు తెలిపిన సమాచారం మేరకు ఆ పాఠశాలలో పనిచేస్తున్న శ్రీధర్ అనే ఉపాధ్యాయుడు పాఠశాలలో విద్య బోధన సమయంలో మద్యం సేవిస్తున్నాడు. విద్యార్థులను, వారి తల్లిదండ్రులను ఒళ్ళు గగుర్లు పొడిచేలా అసభ్యకరమైన పదజాలంతో దూషిస్తున్నాడు. దీనిపై తల్లిదండ్రులు మండల విద్యాశాఖాధికారి కి ఫిర్యాదు చేశారు.

You might also like

Leave A Reply

Your email address will not be published.