FbTelugu

బాలికపై కీచక టీచర్ వేధింపులు

teacher-abused-school-girl-in-school

అనంతపురం: విద్యాబుద్దులు చెప్పి విద్యార్థులను సద్మార్గంలో నడిపించాల్సిన గురువే.. విద్యార్థినులపై కన్నేసి వేదింపులకు పాల్పడిన ఘటన అనంతపురం జిల్లాలో చోటుచేసుకుంది. బాధిత విద్యార్థి తల్లిదండ్రుల వివరాల ప్రకారం… జిల్లాకేంద్రంలోని బస్ స్టాండ్ సమీపంలోని నారాయణ స్కూల్లో 13 సంవత్సరాల బాలిక పై సైన్స్ టీచర్ కార్తిక్ కొన్ని నెలలుగా వేధింపులకు పాల్పడుతున్నాడు. దీంతో తీవ్ర మనస్తాపానికి గురైన బాలిక తల్లిదండ్రులకు చెప్పడంతో తల్లిదండ్రులు స్కూల్ కి వచ్చి కీచక టీచర్ కి చెప్పులతో కొట్టి దేహశుద్ధి చేశారు.

గతంలో కూడా పలుమార్లు ఇలాంటి ఘటనలు జరిగినా కూడా.. బయటకి పొక్కకుంకా చూసిన ఘటనలు చాలా ఉన్నాయని ఆరోపిస్తున్నారు. దీనిపై తగిన చర్యలు తీసుకోవాలని విద్యార్థి సంఘాలు ఆందోళన చేపట్టాయి.

You might also like