FbTelugu

త్వరలో టీ వర్క్స్ వెంటిలేటర్

హైదరాబాద్: తెలంగాణ ప్రభుత్వ ఆధర్యంలోని టీ వర్క్స్ వెంటిలేటర్ ను అభివృద్ధి చేసింది. పంజగుట్ట నిమ్స్ లో దీనిని ప్రయోగాత్మకంగా వినియోగిస్తున్నారు. విజయవంతమైతే పెద్ద ఎత్తున ఉత్పత్తి చేసి ఆసుపత్రులకు పంపిణీ చేయనున్నారు.

యువతలో నైపుణ్యాభివృద్ధి కోసం రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించిన టీ వర్క్స్ కొత్తగా వెంటిలేటర్ ను అభివృద్ధి చేసింది. చౌక ధరతో రూపొందించిన ఈ పరికరాన్ని నిమ్స్ లో పరీక్షిస్తున్నారు. దీని రూపకల్పనలో వైద్యులు కీలకంగా వ్యవహరించారని టీ వర్క్స్ సీఈఓ సుజయ్ కారంపూరి తెలిపారు.

మార్కెట్ లోకి వస్తే ఈ పరికరం ఎంతో ఉపయోగపడుతుందని నిమ్స్ అనస్తీషియా విభాగం అధిపతి డా.పద్మజ అన్నారు. అంబూలెన్స్ లో ఉపయోగించి రోగుల ప్రాణాలు కాపాడవచ్చన్నారు. ప్రస్తుత కరోనా సమయంలో వెంటిలేటర్లకు అధిక డిమాండ్ ఉంది.

You might also like