FbTelugu

ప‌సుపు గూడు ప‌ల‌చ‌న‌వుతోందా!

TDP-Weakening

టీడీపీ అధినేత చంద్ర‌బాబు ఇది ఊహించి ఉండ‌రు. క‌నీసం ఆలోచ‌న కూడా చేసి ఉండ‌క‌పోవ‌చ్చు. ఎందుకంటే ఇప్పుడు టీడీపీలో చోటుచేసుకుంటున్న వ‌రుస ఘ‌ట‌న‌లు పార్టీను న‌ట్టేట ముంచుతాయ‌నే ఆందోళ‌న కూడా అధినేత అంత‌ర్మ‌థ‌నానికి కార‌ణ మ‌వుతోంది. కానీ చుట్టూ క‌ష్టాలు.. పోలీసు కేసులు. పాత త‌ప్పిదాలు వెంటాడుతుంటే ఏమి చేయ‌లేక నిస్స‌హాయంగా లొంగిపోవ‌ట‌మో.. పారిపోవ‌ట‌మో మిన‌హా టీడీపీ నేత‌లు ఏమి చేయ‌లేనంత‌టి నిస్సహాయంగా మారుతున్నారు. ఈ వ్య‌వ‌హారంలో వైసీపీను దోషిగా చూపాల‌ని చంద్ర‌బాబు భావించినా ఎక్క‌డా వీలు కావ‌ట్లేదు. ఎందుకంటే.. వైసీపీ ఆరోప‌ణ‌లు, బాధితుల ఫిర్యాదులు టీడీపీ త‌ప్పిదాల‌కు నిలువెత్తు నిద‌ర్శ‌నం. కాద‌ని చెప్పే ధైర్యం తెలుగు త‌మ్ముళ్ల‌కు లేదు. మౌనంగా ఉంటే స‌రిపోతుందనే భ‌రోసా పార్టీ కేడ‌ర్‌కూ లేకుండా పోయింది. ఇన్ని ఇబ్బందుల‌ను ఎదుర్కొంటూ పార్టీ కోసం ప‌నిచేస్తే 2024లో అధికారంలోకి వ‌స్తామ‌నే ధైర్యం కూడా పార్టీ శ్రేణుల్లో క‌నిపించ‌ట్లేదు.

కోడెల శివప్రసాద రావు ఆత్మ‌హ‌త్య‌, చింత‌మ‌నేని ప్రభాకర్ చుట్టూ కేసుల వ‌ల‌, య‌ర‌ప‌తినేని శ్రీనివాస రావు పై సీబీఐ విచార‌ణ‌, జేసీ దివాక‌ర్ రెడ్డి ట్రావెల్స్ బండారం బ‌య‌ట‌పెట్ట‌డం. ఇటువంటి ప‌రిస్థితుల్లో సుజ‌నాచౌద‌రి, సీఎం ర‌మేష్‌, ఆదినారాయ‌ణ‌ రెడ్డి వంటి సీనియ‌ర్లే బీజేపీ పంచ‌కు చేరి ర‌క్ష‌ణ పొందారు. అటువంటిది చిన్న‌పాటి నేత‌లు.. చోటా కార్య‌క‌ర్త‌లు వైసీపీను ఎదురించి ఎంత‌కాలం మ‌నుగ‌డ కొన‌సాగించ‌గల‌రు. ఎన్టీఆర్ పెట్టిన పార్టీ అనే మాట ప‌క్క‌న‌బెట్టారు. మ‌న క‌మ్మ పార్టీ అనేది కూడా ప‌ట్టించుకోవ‌ట్లేదు. వ‌ల్ల‌భ‌నేని వంశీ పార్టీ మారినా.. రాజ‌కీయాల‌కు దూర‌మైనా కేవ‌లం త‌న వ్య‌క్తిగ‌త అంటున్నారు. పార్టీ పెద్ద‌లు నచ్చ‌జెప్పే ప్ర‌య‌త్నం చేసినా సారీ చెప్పి తీసుకున్న నిర్ణ‌యానికే క‌ట్టుబ‌డి ఉన్నానంటూ తెగేసి చెప్పారు. ఎమ్మెల్యే గంటా శ్రీనివాస రావు కూడా వైసీపీ తీర్దం పుచ్చుకునేందుకు ఉవ్విళ్లూరుతున్నారు. అవంతి శ్రీనివాస్‌ను ఒప్పించి అయినా స‌రే ఫ్యాన్ రెక్క‌ల కింద‌కు చేరాల‌నుకుంటున్నాడు. ఇలా. క‌మ్మ‌, కాపు వ‌ర్గాల కీల‌క నేత‌లు వైసీపీ వైపు చూస్తున్నారు. టీడీపీలో కాపుల‌కు ప్ర‌యార్టీ ఇచ్చార‌ని క‌మ్మ‌లు.. ఎంత ప‌నిచేసినా క‌మ్మ‌ల‌కే అంద‌లం అనే భావ‌న కాపునాయ‌కుల్లో బ‌లంగా పాతుకుపోయింది. ఇలా. రెండు వ‌ర్గాల‌ను ఓటు బ్యాంకు కోసం వాడుకున్న టీడీపీ ప‌రిస్థితి ఇప్పుడు అగ‌మ్య‌గోచ‌రంగా మారింది. దీన్నుంచి ఎలా బ‌య‌ట‌ప‌డాల‌నే ప్ర‌శ్న మాత్రం.. అధినేత‌కు స‌వాల్ విసిరింద‌నే చెప్పాలి.

You might also like