FbTelugu

ఉద్యోగసంఘ నేతలా? వైసీపీ సేవకులా ?: సుధాకర్ రెడ్డి

అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎన్జీవోల సంఘం అధ్యక్షుడు చంద్రశేఖర్ రెడ్డి, సచివాలయ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు వెంకట్రామరెడ్డిల తీరుపై టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి డాక్టర్ ఎన్ బి.సుధాకర్ రెడ్డి తీవ్రంగా మండిపడ్డారు. ఇవాళ ఆయన మీడియాతో మాట్లాడుతూ ఉద్యోగ సంఘాల నేతలపై తీవ్రంగా విరుచుకుపడ్డారు. ఎన్నికల డ్యూటీ వద్దంటున్న వీరికి వైన్ షాపుల ముందు డ్యూటీ వేస్తే ముద్దా అంటూ ఎద్దేవా చేశారు. రాష్ట్రంలో పంచాయతీ ఎన్నికల నిర్వహణపై, ఎస్ఈసీపై వీరి మాటలు అభ్యంతరకరంగా ఉన్నాయన్నారు. స్వయం ప్రతిపత్తి కలిగిన రాజ్యాంగ వ్యవస్థ నిర్ణయాన్ని ఉద్యోగుల వ్యతిరేకించడమేంటని ప్రశ్నించారు.

దేశంలో ఇప్పటికే పలుచోట్ల ఎన్నికలు జరుగుతున్న విషయాన్ని ఈ నేతలు విస్మరించడం వెనుక కులతత్వం దాగి వుందని అన్నారు. పీఆర్సీ, సీపీఎస్ రద్దు, కాంట్రాక్టు ఉద్యోగుల భద్రత లాంటి ఉద్యోగుల సమస్యలు ఏనాడూ పట్టించుకోని వీరు ఎన్నికల డ్యూటీ చేస్తే ప్రాణాలు పోతాయనడం హాస్యాస్పదంగా ఉందన్నారు. ఎన్నికల సంఘం ఉద్యోగుల రక్షణ కోసం అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నదన్నారు. వేలాది మందితో ఊరేగింపులు సభలు నిర్వహిస్తే సోకని కరోనా ఎన్నికలు నిర్వహిస్తే ఎలా వస్తుందో ఆ మేధావులు ఇద్దరూ చెప్పాలని డిమాండ్ చేశారు. రాజ్యాంగేతర శక్తుల్లా వ్యవహరిస్తున్న వారిపై శాఖాపరమైన చర్యలు తీసుకోవాలని సుధాకర్ రెడ్డి డిమాండ్ చేశారు.

You might also like

Leave A Reply

Your email address will not be published.