FbTelugu

టిఆర్ఎస్ తో చర్చలు జరపలేదు: ఎల్‌.రమణ

హైదరాబాద్: టిఆర్ఎస్ నాయకులతో చర్చలు జరపలేదని, పదవుల కోసం పాకులాడే వ్యక్తిని కాదని టిడిపి రాష్ట్ర అధ్యక్షుడు ఎల్.రమణ్ స్పష్టం చేశారు. అయితే రాష్ట్ర రాజకీయాల్లో ఊహించని మార్పులు వస్తున్నాయని అన్నారు.
తమ పార్టీలో చేరాల్సిందిగా బిజెపి, టిఆర్ఎస్ పార్టీలు ఆహ్వానించాయని చెప్పారు. బలహీనవర్గాల బిడ్డగా తొలినాళ్ల నుంచే టిడిపి అభివృద్ధికి కృషి చేశానన్నారు.

స్వర్గీయ ఎన్టీఆర్‌, మాజీ ముఖ్యమంత్రి ఎన్.చంద్రబాబు నాయుడు తనను ప్రోత్సహించారని చెప్పారు. ఇప్పుడు తాను పదవుల కోసం టిఆర్ఎస్ కు ప్రతిపాదనలు చేసినట్లు సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతుండడాన్ని ఆయన ఖండించారు. పార్టీ కోసం పనిచేస్తూ ఆ క్రమంలో ఇచ్చే బాధ్యతలను సక్రమంగా నిర్వహిస్తూ ముందుకెళ్తుంటానని తెలిపారు. రెండు పార్టీల ఆహ్వానంపై స్థానికంగా ఉన్న పార్టీ నేతలు, కార్యకర్తలు, అభిమానులతో చర్చిస్తున్నానని చెప్పారు. ఆ తర్వాత తన నిర్ణయం వెల్లడిస్తానని రమణ చెప్పారు.

You might also like

Leave A Reply

Your email address will not be published.