FbTelugu

వైసిపి పాలన మూడేళ్లే: అచ్చెన్నాయుడు

అమరావతి: కర్నూలు జిల్లా పెద్దకడుబూరు మండం బసలదొడ్డిలో టిడిపి సానుభూతిపరులకు తాగునీరు నిలిపివేయడం హేయమైన చర్య అని టిడిపి రాష్ట్ర అధ్యక్షులు కింజరాపు అచ్చెన్నాయుడు విమర్శించారు.
కులం, చూడం మతం చూడం అని చెప్పిన సిఎం వైఎస్.జగన్ మోహన్ రెడ్డి ఇతర పార్టీల వాళ్లకు కనీసం త్రాగునీరు కూడా ఇవ్వకుండా కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్నారు.

మొన్నటి ఎన్నికల్లో టిడిపి కి ఓట్లు వేశారని నీళ్లు, ఫించన్, రేషన్ ఆపి వేయడం జగన్ ఫ్యాక్షన్ మనస్తత్వనికి నిదర్శనమని ఆరోపించారు. వివాద రహితుడైన మాజీ ఎమ్మెల్యే బిసి.జనార్ధన్ రెడ్డి పై అకారణంగా అక్రమ కేసులు పెట్టి జైలుకు పంపి వేధిస్తున్నారన్నారు. రాష్ట్రంలో టిడిపి అధికారంలోకి వచ్చిన రోజు నుంచి జగన్, వైసిపి నేతలు ప్రతి రోజూ పచ్చత్తాపపడక తప్పదని అచ్చెన్నాయుడు హెచ్చరించారు.

You might also like

Leave A Reply

Your email address will not be published.