FbTelugu

ప్రజారోగ్యంతో వైసిపి చెలగాటం: అచ్చెన్నాయుడు

అమరావతి: ప్రజారోగ్యంతో వైసిపి ప్రభుత్వం చెలగాటమాడుతోందని టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు కె.అచ్చెన్నాయుడు మండిపడ్డారు. హిందూపురం ప్రభుత్వాసుపత్రిలో ఆక్సిజన్ అందక కరోనా రోగుల మృతి అత్యంత బాధాకరమన్నారు.

రెండు రోజుల్లోనే ఈ ఆస్పత్రిలో 11 మంది మృతి ఆక్సిజన్ లభ్యం కాక ప్రాణాలు విడిచారన్నారు. కరోనా పాజిటివ్ రోగులకు సకాలంలో ఆక్సిజన్ అందించడంలో ప్రభుత్వం విఫలమైందన్నారు. పలు ప్రభుత్వ ఆస్పత్రుల్లో ఆక్సిజన్ కేకలు మిన్నంటుతున్నాయన్నారు. ప్రాణవాయువు కోసం రోగుల ఆర్తనాదాలు ప్రభుత్వానికి వినిపించడం లేదా?. అసలు రాష్ట్రంలో పాలన జరుగుతోందా? అని ఆయన నిలదీశారు. జగన్ రెడ్డి అసమర్థతకు ఇంకెంతమంది బలికావాలి? ప్రభుత్వం మొద్దు నిద్ర వీడి ప్రజల ప్రాణాలను కాపాడాలన్నారు. ప్రభుత్వం నిర్లక్ష్యం వీడకపోతే ప్రజలు తిరగబడే రోజులు దగ్గరలోనే ఉన్నాయని అచ్చెన్నాయుడు హెచ్చరించారు.

You might also like

Leave A Reply

Your email address will not be published.