FbTelugu

ఆ హత్యతో నాకు సంబంధం లేదు: మున్సిపల్ కమిషనర్

అమరావతి : టీడీపీ అధికార ప్రతినిధి సుబ్బయ్య హత్య కేసుతో తనకు ఎలాంటి సంబంభం లేదని ఈ కేసులో నిందితురాలిగా ఉన్న మున్సిపల్ కమిషనర్ అనురాధ స్పష్టం చేశారు. ఇవాళ ఆమె ఈ విషయంపై మీడియాతో మాట్లాడారు.
హత్యకు ముందు సుబ్బయ్య తనకు ఫోన్ చేశాడని, సుబ్బయ్య వచ్చే సమయానికి తాను సభాస్థలానికి దగ్గరలోనే ఉన్నట్టుగా తెలిపారు.

గతంలో కూడా సుబ్బయ్య తనని అనేక సార్లు పలు సమస్యలపై కలిసారని తెలిపారు. ఇళ్ల పట్టాలకు సంబంధించి మాట్లాడింది కూడా వాస్తవమేనన్నారు. అయితే ఈ హత్యకు సంబంధం ఉన్నట్లు సుబ్బయ్య భార్య అపరాజిత ఎమ్మెల్యే రాజమల్లు, బంగారురెడ్డి లతో పాటూ తన(అనురాధ) పేరు కూడా చెప్పడం చాలా అన్యాయమని అన్నారు.

You might also like

Leave A Reply

Your email address will not be published.