FbTelugu

ఆ డబ్బులు వైఎస్.భారతి బంధువు కోసమే: టీడీపీ

విజయవాడ: చెన్నై నగరంలో ఉన్న వైఎస్.భారతి బంధువు సుధాకర్ రెడ్డి కి డబ్బులు చేర్చేందుకే మంత్రి బాలినేని శ్రీనివాస్ రెడ్డి స్టిక్కర్ పేరుతో ఉన్న కారు వెళ్ళిందని టీడీపీ జిల్లా పార్టీ అధ్యక్షులు బచ్చుల అర్జునుడు ఆరోపించారు.
మంత్రి అనుచరులు, గుమాస్తాల మధ్య మిత్ర బంధం పట్టుపడిన తర్వాత కేసును తారుమారు చేసేందుకు ప్రయత్నిస్తున్నారని ఆయన విమర్శించారు. విద్యుత్ శాఖ మంత్రి బాలినేని శ్రీనివాస్ రెడ్డికి చెందిన కారులో తమిళనాడు పోలీసులు రూ.5.5 కోట్ల నగదు స్వాధీనం చేసుకున్నా అబద్దం అంటూ దబాయిస్తున్నారన్నారు.

తమిళనాడు లో బాలినేని కారు పట్టుపడ్డ వెంటనే కారు పైన ఉన్న స్టిక్కర్ నాది కాదని మాట మార్చేశారని బచ్చుల అర్జునుడు విమర్శించారు. దీనికి నైతిక బాధ్యత వహిస్తూ మంత్రి పదవి నుంచి బాలినేనిని బర్తరఫ్ చేయాలని ఆయన డిమాండ్ చేశారు. మంత్రులు తమ సొంత కార్లలో అక్రమంగా సంపాధించిన డబ్బులను ఇతర రాష్ట్రాలకు తరలిస్తున్నారని ఆయన విమర్శించారు. తమిళనాడులో బాలినేని కారులో పట్టుబడిన రూ.5.5 కోట్ల నగదు కేసును ఈడీ కి అప్పచెప్పాలని అర్జునుడు డిమాండ్ ఛేశారు.

You might also like