FbTelugu

టీడీపీ ప‌గ్గాలు ఎవ‌రికిద్దాం!

న‌ల‌భైఏళ్ల రాజ‌కీయ అనుభ‌వం. పీఎం ప‌ద‌వి ఇస్తామ‌ని బ‌తిమిలాడినా.. ఛీ వ‌ద్దంటూ.. ఏపీ సీఎంగా ఉండ‌ట‌మే ముఖ్య‌మ‌ని బావించిన నాయ‌కుడు చంద్ర‌బాబు మ‌న‌సులో ఉన్న ఆలోచ‌న.

నిజ‌మే.. న‌ట‌సార్వ‌భౌముడు నంద‌మూరి తార‌క‌రామారావు సంధించిన తెలుగుదేశం విజ‌యశంఖం ఇప్పుడు మూగ‌బోయింది. కొంద‌రైతే.. అబ్బే.. మూల‌న‌ప‌డిపోయిందంటూ ఎద్దేవా చేస్తున్నారు. పోన్లే.. కాసేపు అవ‌న్నీ ప‌క్క‌న‌బెడ‌దాం.. ఇప్పుడు టీడీపీను న‌డిపించేందుకు నాయ‌కుడు కావాలి. అది కూడా మాస్‌లో ఇమేజ్‌.. క్లాస్‌లో క్రేజ్‌.. ఓవ‌రాల్‌గా చెప్పాలంటే లీడ‌ర్ అవ‌స‌రం. మ‌రి చంద్ర‌బాబు లేరా! ఏమిటనే సందేహం కూడా రావ‌చ్చు.

అయితే.. ఆయ‌న కూడా 70 ఒడిలో ప‌డ్డారు. మొన్న‌టంత స్పీడు కూడా త‌గ్గింద‌నే అభిప్రాయం 2014-19 మ‌ధ్య పాల‌న‌లో జ‌నం కూడా ప‌సిగ‌ట్టారు. పైగా సీఎం ర‌మేష్‌, సుజ‌నాచౌద‌రి, ఎర్ర‌న్నాయుడు, నారాయ‌ణ‌, బుద్దా వెంక‌న్న వంటి నేత‌ల చేతిలో తాను కేవ‌లం సీఎం అనే పేరున్న బొమ్మ‌గా మిగిలిపోయార‌నే అభిప్రాయం తెలుగు త‌మ్ముళ్ల‌లోనూ బ‌ల‌ప‌డింది. పైగా చిన‌బాబును ఐదేళ్ల‌పాటు నాయ‌కుడుగా.. అది కూడా నంద‌మూరి, నారా రెండు కుటుంబాల తెలివితేట‌లు పుణికిపుచ్చున్న వ‌క్త‌గా వంద‌ల అడుగుల ఎత్తులో లేపాల‌ని చూసినా.. క‌నీసం అంగుళం కూడా లోకేషుడి ప్రాభ‌వాన్ని పెంచ‌లేక‌పోయారు. బాహుబ‌లిగా చూపాల‌నే ప్ర‌య‌త్నం విఫ‌ల‌మ‌వ‌టంతో బాబు గారు అండ్ కో కాస్త వెనుకంజ వేశారు.

కానీ.. నారా వారి ఇంట‌.. పార్టీను న‌డిపేవారు లేర‌నే అభిప్రాయం కూడా క‌మ్మ‌వ‌ర్గం నుంచి వినిపిస్తుంది. పైగా నంద‌మూరి ఇంట నుంచి వ‌చ్చిన నారా బ్రాహ్మ‌ణిలోని ప్ర‌తిభ సామ‌ర్థ్యం హెరిటేజ్ వ్యాపారంలో చ‌క్రం తిప్ప‌టం ద్వారా బాగానే ప్ర‌చారంలోకి వ‌చ్చింది. బుడ్డోడు జూనియ‌ర్ ఎన్టీఆర్ మాకొద్దీ రాజ‌కీయాలంటూ దూరంగా జ‌రిగినా.. పార్టీకు అవ‌స‌ర‌మైన‌పుడు వ‌స్తానంటూ హింట్ ఇచ్చాడు. అంతేకానీ.. ప్ర‌త్య‌క్ష రాజ‌కీయాల‌లోకి వ‌చ్చి ఇప్పుడే కెరీర్‌ను నాశ‌నం చేసుకోవాల‌నుకోవ‌ట్లేదు. దీనికి ఉదాహ‌ర‌ణ తెలంగాణ ముంద‌స్తు ఎన్నిక‌ల్లో అదేనండీ 2018లో అక్క సుహాసిని కూకట్‌ప‌ల్లి నుంచి పోటీచేస్తే.. ట్వీట్ చేసి గెలిపించ‌మ‌ని కోరాడు. అంతే త‌ప్ప ఎక్క‌డా ప్ర‌చారానికి రాలేదు.

ఇటు మెగాస్టార్‌, అటు సూప‌ర్‌స్టార్ కుటుంబాల‌తో స‌న్నిహితంగా మెలిగే జూనియ‌ర్ ఇప్పుడు పార్టీ పేరిట ముద్ర వేయించుకోవాల‌నుకోవ‌ట్లేదు. కాబ‌ట్టి..ఎటు చూసినా.. నారా బ్రాహ్మ‌ణిని తెర‌మీద‌కు తీసుకొచ్చి.. ఇదిగో నంద‌మూరి వార‌సురాలు అంటూ.. వెనుక నుంచి చంద్ర‌బాబు చ‌క్రం తిప్పేందుకు అవ‌కాశాలున్నాయి. మ‌రి దీన్ని ఎంత వ‌ర‌కూ బాబుగారు ఆచ‌రిస్తార‌నేది చూడాల్సిందే. ఏమైనా.. ఇప్పుడు దుమ్ముప‌ట్టి.. పంక్స‌ర్లు ప‌డి.. హ్యాండిల్స్ లేని సైకిల్ న‌డిపేందుకు సారీ… ప‌రుగులు పెట్టించేందుకు తెలుగుదేశం పార్టీకు నాయ‌కుడైతే కావాలి.

You might also like