FbTelugu

ఇక టీడీపీ పని గోవిందా…: నాగబాబు

డెవలప్ మెంట్ అంతా అనుకూల పత్రికలు, టీవీల్లోనే

టీడీపీ అక్రమాలపై లక్ష పేజీల గ్రంథాలు రాయోచ్చు

భవిషత్తులో అధికారంలోకి రావడం కల

మొన్న మహాత్మాగాంధీ, నిన్న హీరో నందమూరి బాలకృష్ణపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన బుల్లితెర జడ్జీ కొణిదెల నాగబాబు ఈసారి తెలుగుదేశం పార్టీపై ఘాటుగా విరుచుకుపడ్డారు.

ఈ సారి ఆయన తెలుగుదేశం పార్టీని టార్గెట్ చేశారు. ఏపీలో వైసీపీ పార్టీ తరవాత అధికారం లోకి వైసీపీ వస్తుందా, జనసేన వస్తుందా,బీజేపీ వస్తుందా అన్న విషయం కాలమే నిర్ణయించాలి అని నాగబాబు ట్వీట్ చేశారు. ఒక్కటి మాత్రం నిజం చెబుతున్నాను భవిష్యత్తులో టీడీపీ రాదని నా గట్టి నమ్మకం అని అన్నారు.

టీడీపీ ప్రభుత్వ హయాం లో ఆంధ్రులకు ఊడబోడిచింది ఏమి లేదు. టీడీపీ చేసిన డెవలప్ మెంట్ అంత ఆనుకుల టీవీల్లోను, పత్రికల్లో నే కనబడేదన్నారు. వాస్తవంగా క్షేత్రస్థాయిలో  కనిపించింది తక్కువ. దీనికి తోడు అవినీతి, ఇసుక మాఫియా, కాల్ మనీ ఇలా చెప్పుకుంటూ పోతే అబ్బో ఇంకా చాలవున్నాయి. వీళ్ల అక్రమాలు చెప్పడానికి ఈ ట్విట్టర్ ఎం సరిపోతోందన్నారు.

వీరిపై లక్ష పేజీల గ్రంధాలే రాయొచ్చు. అందుకే కాబోలు మొన్నటి ఎన్నికల్లో ఘోరంగా ఓడిపోయింది అన్న విషయం టీడీపీ వాళ్ళు ఇప్పటికైనా గుర్తించాలి. ఇక నెక్స్ట్ మేమె వస్తాం మాదే రాజ్యం లాంటి ఇల్యూషన్స్ లోంచి బయటకి రావాలి బ్రదర్. లేదు మేము ఇలాంటి పగటి కలల్లోనే జీవిస్తాం అనుకొంటే దే అర్ వెల్ కమ్ అని అన్నారు. కానీ మానసిక శాస్త్రం లో అలాంటి వాటిని హ్యలూసినేషన్స్ అంటారని నాగబాబు దెప్పి పొడిచారు.

You might also like