FbTelugu

జగన్‌ అండ వ‌ల్లే ఈ నేరాలు: చంద్రబాబు

అమరావతి: ఆంధ్రప్రదేశ్ లో సీఎం జగన్ అండ వల్లనే నేరగాళ్లు రెచ్చిపోయి నేరాలు ఎక్కువౌతున్నాయని టీడీపీ జాతీయాధ్యక్షుడు నారా చంద్రబాబు అన్నారు. గురజాల నియోజకవర్గం పెదగార్లపాడు మాజీ సర్పంచి పురంశెట్టి అంకులును దారుణ హత్య ఘటనపై ఆయన తీవ్రంగా స్పందించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాష్ట్రంలో ఇప్ప‌టి వ‌ర‌కు 16 మంది టీడీపీ కార్యకర్తలను హ‌త్య చేశారని అన్నారు. వైసీపీ నేత‌లు హత్యారాజకీయాలు చేస్తున్నార‌ని అన్నారు. రాష్ట్రంలో శాంతి భద్రతలు క‌ర‌వ‌య్యాయ‌ని అన్నారు. ప్రశాంతంగా ఉండే ఆంధ్ర‌ప్ర‌దేశ్ ను వైసీపీ నాయ‌కులు నాశ‌నం చేశార‌న్నారు. దోషులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు.

You might also like

Leave A Reply

Your email address will not be published.