FbTelugu

ఆ జీవోను రద్దు చేయమంటే అక్రమ అరెస్టులా?: లోకేశ్

అమరావతి: ప్రైవేట్ కాలేజీల్లో చదివే పీజీ విద్యార్థులకు ఫీజు రీయింబర్స్ మెంట్ పథకాన్ని రద్దు చేస్తూ.. ఏపీ ప్రభుత్వం తీసుకొచ్చిన జీవో 77 ను రద్దు చేయమని నిరసన తెలిపితే విద్యార్థులను, విద్యార్థిసంఘ నాయకులను అక్రమంగా అరెస్టు చేసి కేసులు పెడతారా అంటూ.. టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేశ్ మండిపడ్డారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. విద్యార్థి లోకం తిరగబడితే నువ్వు తాడేపల్లి కోట నుండి బయటకు అడుగుపెట్టలేవు అంటూ వార్నింగ్ ఇచ్చారు. విద్యార్థుల భవిష్యత్తుతో ఆటలొద్దని అన్నారు. ఎన్టీఆర్ విదేశీ విద్య పథకాన్ని నిర్వీర్యం చేశారని అన్నారు.

You might also like

Leave A Reply

Your email address will not be published.