FbTelugu

కరోనాతో చస్తుంటే గుర్రపు స్వారీలా?: లోకేష్

అమరావతి: రాష్రంలో మంచాలు దొరక్క, అక్సిజన్ లభించక, ఆక్సిజన్ కొరత మూలంగా కరోనా రోగులు పిట్టల్లా రాలిపోతుంటే వైసిపి ఎమ్మెల్యేలు మాత్రం గుర్రపు స్వారీలు చేస్తూ మజా చేస్తున్నారని టిడిపి ఎమ్మెల్సీ నారా లోకేష్ విమర్శించారు.

మంచాలు దొరక్క బయట, మంచాలు ఉండి ఆక్సిజన్ లేక కరోనా రోగులు చనిపోతున్నారని లోకేష్ ట్వీట్ చేశారు. ఇవేమి పట్టని వైసిపి ఎమ్మెల్యేలు గుర్రపు స్వారీ చేస్తూ ఆనందడోలికల్లో మునిగి తేలుతున్నారు. వందలాది మంది చనిపోతుంటే వైసిపి ఎమ్మెల్యేలు సరదా సరదా జీవితాన్ని గడుపుతున్నారన్నారు. తిరుపతి రుయా ఆసుపత్రిలో ఆక్సిజన్ అందక 11 మంది ప్రాణాలు గాల్లో కలిస్తే, ఆసుపత్రికి సమీపంలోని 60 కిలోమీటర్ల దూరంలో ప్రభుత్వ చీఫ్ విప్ గడికోట శ్రీకాంత్ రెడ్డి, విప్ కోరుమట్ల శ్రీనివాసులు, కడప మేయర్ సురేష్ బాబు గుర్రపు స్వారీలు చేశారన్నారు. ప్రభుత్వానికి, వైసిపి నాయకులకు ప్రజల ప్రాణాలంటే ఎంత లెక్కలేనితనం ఉందో ఈ గుర్రపు స్వారీ ఎంజాయ్ మెంట్ తో బట్టబయలు అయిందని లోకేష్ ట్వీట్ చేశారు.

You might also like

Leave A Reply

Your email address will not be published.