FbTelugu

పరీక్షలపై మొండిపట్టు సరికాదు: నారా లోకేష్

అమరావతి: ఏపిలో టెన్త్, ఇంటర్మీడియట్ పరీక్షలు నిర్వహించాలని వైసిపి ప్రభుత్వం మొండిగా ఉండడం సరికాదని టిడిపి ఎమ్మెల్సీ నారా లోకేష్ బాబు అన్నారు.

ఇవాళ పరీక్షల రద్దుకు డిమాండ్ చేస్తూ విద్యార్థులు, తల్లిదండ్రులతో లోకేశ్‌ వర్చువల్‌గా సమావేశం అయ్యారు. వారి నుంచి అభిప్రాయాలు సేకరించి ప్రభుత్వానికి నివేదిక ఇవ్వనున్నట్లు తెలిపారు. కరోనా సెకండ్ వేవ్ ఉధృతంగా ఉన్న ఈ సమయంలో పరీక్షలు నిర్వహిస్తామని చెప్పడం మూలంగా విద్యార్థులు తీవ్ర ఒత్తిడికి గురవుతున్నారు. పరీక్షల పై నిర్ణయం తీసుకునేందుకు సిఎం జగన్‌కు సమయం సరిపోవట్లేదన్నారు. ప్రధాని నరేంద్ర మోదీకి సిబిఎస్ఈ పరీక్షలపై సమయం దొరికింది గానీ, జగన్‌కు మాత్రం సమయం దొరకట్లేదని నారా లోకేశ్‌ ఎద్దేవా చేశారు.

You might also like

Leave A Reply

Your email address will not be published.