FbTelugu

అర్థరాత్రి ఆత్మలతో మాటలా!: నారా లోకేష్…

అమరావతి: సిఎం వైఎస్.జగన్ మోహన్ రెడ్డి… అర్ధరాత్రి ఆత్మలతో మాట్లాడటం ఆపి కాసేపు మంత్రులతో, అధికారులతో మాట్లాడితే కొంతవరకైనా వాస్తవాలు తెలిసే అవకాశం ఉంటుందని టిడిపి ఎమ్మెల్సీ నారా లోకేష్ బాబు చురక అంటించారు.
నిరుద్యోగులను నిలువునా ముంచేసిన మీ జాబ్ లెస్ క్యాలెండర్ ని రద్దు చేస్తూ క్యాబినెట్ సమావేశంలో నిర్ణయం తీసుకోవాలని లోకేష్ ట్వీట్ చేశారు.

పాదయాత్రలో హామీ ఇచ్చిన విధంగా 2.30 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు కల్పిస్తూ కొత్త జాబ్ క్యాలెండర్ విడుదల చేయాలని డిమాండ్ చేశారు. మీరు ఆత్మలతో కాకుండా మీ అంతరాత్మతో మాట్లాడి నిరుద్యోగ యువతకు న్యాయం చేస్తారని ఆశిస్తున్నాను. సిఎం వైఎస్.జగన్ మోహన్ రెడ్డి రాత్రి తన తండ్రి దివంగత వైఎస్ఆర్ తో మాట్లాడతారనే టాక్ ఈ మధ్య ఏపిలో విన్పిస్తున్నది. కరోనా గురించి కూడా ఏసు ప్రభువుతో మాట్లాడతారని ప్రచారం జరుగుతున్నది.

You might also like

Leave A Reply

Your email address will not be published.