FbTelugu

క్షత్రియుల సహనాన్ని పరీక్షించొద్దు: ఎమ్మెల్సీ రాజు హెచ్చరిక

అమరావతి: ఎంపి కె.రఘురామకృష్ణంరాజు అరెస్ట్ వైసిపి అరాచక పాలనకు నిదర్శనం టిడిపి ఎమ్మెల్సీ మంతెన సత్యనారాయణరాజు అన్నారు. క్షత్రియులపై వైసిపి ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతోందని ఆయన ఆరోపించారు.

మొన్న మాజీ కేంద్ర మంత్రి పి.అశోక్ గజపతిరాజు రాజుపై అక్రమ కేసు పెట్టారు, ఇవాళ రఘురామ కృష్ణంరాజుని అరెస్ట్ చేశారు? రేపు మరొకరిని అరెస్ట్ చేస్తారా అని సిఎం జగన్ మోహన్ రెడ్డిని ప్రశ్నించారు. క్షత్రియులు సర్వశక్తివంతులు అని సమాజ సేవ చేస్తూ.. రాష్ట్రాభివృద్దికి పాటు పడేవాళ్లన్నారు. అలాంటి వారిపై కక్ష సాధింపు చర్యలు సరికాదున్నారు. క్షత్రియుల ఓర్పు సహనాన్ని పరీక్షించొద్దని సిఎం జగన్ ను ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. రఘురామకృష్ణంరాజు పై పెట్టిన అక్రమ కేసులు వెంటనే ఎత్తివేసి విడుదల చేయాలి, లేకపోతే తరవాత జరిగే పరిణమాలకు ప్రభుత్వమే బాధ్యత వహించాల్సి ఉంటుందని టిడిపి ఎమ్మెల్సీ మంతెన సత్యనారాయణరాజు హెచ్చరించారు.

You might also like

Leave A Reply

Your email address will not be published.