FbTelugu

వైసిపిలో లుకలుకలకు మాకేం సంబంధం: ఎమ్మెల్సీ వెంకన్న

అమరావతి: వైసీపీలో ఉన్న లుకలుకలు, అంతర్గత విబేధాలకు టిడిపి అధినేత ఎన్.చంద్రబాబు నాయుడు కి ఏమిటి సంబంధం? అని టీడీపీ ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న ప్రశ్నించారు. కె.రఘురామ కృష్ణమరాజుకి ఎంపీ టిక్కెట్ ఇవ్వమని చంద్రబాబు జగన్ తో చెప్పాడా? అని నిలదీశాడు.

వైసిపి ఎంపి కె.రఘురామ కృష్ణమరాజు అరెస్ట్ తో ఆయన ప్రాణాలకు హాని ఉందని కుటుంబసభ్యులు వాపోతుంటే, దాన్ని కూడా చంద్రబాబుకి అంటగడతారా? అన్నారు. వైసిపి ఎంపీలు అరెస్ట్ అయ్యి జైలుకు వెళితే, వారి భార్యాపిల్లలు విలపించరా?. ఆమాత్రం కూడా ఇంగితంలేకుండా అన్నింటికీ చంద్రబాబుని అంటారేమిటి అని నిలదీశారు. ఏపి టిడిపి అధినేత కె.అచ్చెన్నాయుడు, రవీంద్ర, ధూళిపాళ్ల నరేంద్ర, దేవినేని ఉమాల అరెస్ట్ లు సహా, టిడిపి కార్యకర్తల అరెస్ట్ లు, హత్యలపై చంద్రబాబు రాష్ట్రపతికి లేఖ రాయలేదా?, మీరు మరిచిపోయారా అని బుద్దా వెంకన్న మండిపడ్డారు. పొద్దున్నలేస్తే చంద్రబాబు జపం చేయందే వైసిపి నేతలు, మంత్రులు, ఎమ్మెల్యేలకు నిద్ర పట్టడంలేదని ఎద్దేవా చేశారు. హత్యా రాజకీయాలు, వేధింపులు, కక్ష సాధింపులు, కుల మతాల మధ్యచిచ్చులు చంద్రబాబుకి తెలియవని, అవన్నీ జగన్ కు వెన్నతో పెట్టిన విద్య అని ఆయన ఆరోపించారు. బాబు ఎన్నడూ అలాచేసిన వ్యక్తికారని, ఆవిషయం రాష్ట్ర ప్రజలకు తెలుసని బుద్దా వెంకన్న అన్నారు.

You might also like

Leave A Reply

Your email address will not be published.