FbTelugu

బాబుపై భగ్గుమన్న టీడీపీ ఎమ్మెల్యే

అమరావతి: టీడీపీ అధినేత ఎన్.చంద్రబాబు నాయుడు పై ఆ పార్టీకే చెందిన ఎమ్మెల్యే మద్దాళి గిరిధర్ తీవ్ర ఆరోపణలు చేశారు. చంద్రబాబు రాష్ట్రంలో కుల,మతాలను రెచ్చగొడుతున్నారని, దేవుడంటే ఆయనకు నమ్మకం లేదని ఆయన విమర్శించారు.

ఆయన ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో విజయవాడలో 41 ఆలయాలను కూల్చివేశారని, గోదావరి పుష్కరాల్లో 30 మందిని బలితీసుకున్నారని గిరిధర్ మండిపడ్డారు. ఎక్కడో దేవాలయంలో రథానికి నిప్పంటిస్తే దాన్ని సీఎం జగన్మోహన్ రెడ్డికి, దేవాదాయ శాఖ మంత్రి శ్రీనువాసుకు అంటగట్టడం విడ్డూరంగా ఉందన్నారు. సైకిల్ బెల్ లను, టైర్లను దొంగతనం చేసే టీడీపీ ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న బుద్దిలేని వ్యక్తి అని ఎమ్మెల్యే మద్దాళి గిరిధర్ ఘాటుగా విమర్శించారు.

బెజవాడ కనకదుర్గ ఆలయంలోని మూడు వెండి సింహాలు మంత్రి శ్రీనువాసు నివాసంలో ఉన్నాయని వెంకన్న అనడం దారుణమన్నారు. ఆలయానికి సమీపంలోనే నివాసం ఉంటున్న వెంకన్ను తొలుత విచారణ చేయాలని ఆయన పోలీసు శాఖను మద్దాళి గిరిధర్ డిమాండ్ చేశారు.

You might also like

Leave A Reply

Your email address will not be published.